నాని నచ్చిన ‘ఉ.ఉ’

కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (ఉ.ఉ). ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఓటీటీలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయ్. సినిమా అక్కడక్కడ స్లోగా నడించిన బాగుంది. ఓపిగ్గా చూస్తే బాగా నచ్చుతుందని రివ్యూలు చెబుతున్నాయి.

తాజాగా ఈ సినిమాపై నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఓ అద్భుతమైన చిత్రం. థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత దయచేసి మళ్లీ రిలీజ్ చేయండి. ఆ స్లో మోషన్‌లో, ఆ క్లోజప్ సీన్స్, ఆ నవ్వులు బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూడాలని అనుకుంటున్నా.  డైరెక్టర్ వెంకటేష్ మహా ఎంతో నిజాయితీగా చిత్రాన్ని తెరకెక్కించాడు. డియర్ సత్యదేవ్ నేను నీకు ఫ్యాన్ అయ్యాను. సుహాస్ అందర్నీ నవ్వించాడు’ అంటూ రాసుకొచ్చారు.