పూజకు అఖిల్ సరిపోయేలా లేడు

పూజా హెగ్డే.. టాలీవుడ్ ని ఏలుతోంది. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. ఇక అల.. వైకుంఠపురంలో సినిమాతో పూజా బాడీకి భలే గిరాకి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ఆమె కాళ్లని ఫేమస్ చేసేశాడు. నీ కాళ్లని పట్టుకు వదలన్నది చూడే నా కళ్లు.. అంటూ ఆమె కాళ్లపై ఓ పాటని పాడేశాడు. ఆ పాట (సామజవరగమన) ఏకంగా వందల మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొంది. అంత ఫేమస్ అయిన పూజా కాళ్లతో అఖిల్ మెడని గోకించాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాల్గో సినిమాగా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందె. ఇందులో హీరోయిన్ పాత్రలో మంచి ప్రాధాన్యత ఉంటుందని.. పూజా హెగ్డేని ఏరికోరి తీసుకున్నారు. అయితే పూజాకి అఖిల్ ఆనుతాడా ? అన్నది అందరికి ఆలోచింప చేస్తోంది. ఇప్పటికే పూజా హెగ్డే స్టార్ హీరోయిన్. రొమాన్స్ చేయడం ముదురు.

అలాంటిది.. ఒక్క హిట్ కూడా లేని, రొమాన్స్ చేయడంలో పెద్దగా అనుభవం లేని అఖిల్ ఏం సరిపోతాడు అనే కామెంట్స్ వినిపించాయి. అదీ.. నిజమే అన్నట్టుగా బుధవారం విడుదల చేసిన రొమాంటిక్ పోస్టర్ లో అఖిల్ ని డ్యామినేట్ చేసేసింది పూజా. ఆమె కాలీ గోరు వేళ్లతో అఖిల్ మెడని గోకింది. ఇది రొమాంటిక్ గోకుడే అయినా.. దానికి అఖిల్ తట్టుకొనేలా లేడని అనిపిస్తోంది. సినిమా చూస్తేనే గానీ.. అఖిల్ ఏ మేరకు పూజాని సంతృప్తి పరిచాడు అన్నది తెలియనుంది.