చైనా సన్నాయి నొక్కులు
చేసేదంతా చేసేసి ఇప్పుడు డ్రాగన్ చైనా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తాము భారత్ కు ముప్పేం కాదు. భారత్-చైనాల మధ్య కొన్నేళ్లుగా తత్సబంధాలు కొనసాగుతున్నాయి. తాత్కాళీక విబేధాలని చూసి.. భారత్కు చైనా నుంచి వ్యూహాత్మక విబేధాలు ఉన్నాయని భావించవద్దని ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సన్ వేడాంగ్ అభిప్రాయపడ్డారు.
“కొన్ని కీలక అంశాల్లో ఇరు దేశాల మధ్య స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. శాంతియుత మార్గంలో మేం(చైనా) అభివృద్ధిని కోరుకుంటున్నాం. భారత్కు చైనా ఎప్పుడూ వ్యూహాత్మక ముప్పు కాదు. కంటికి కనిపించని వైరసే ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం. భారత్-చైనా మధ్య ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిన చరిత్రను విస్మరించడం హానికరం. తాత్కాలిక విభేదాలు, వివాదాలను బూచిగా చూపి వేల సంవత్సరాల సత్సంబంధాల చరిత్రను మరవడం ఏమాత్రం మంచిది కాదు” అని వేడాంగ్ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు.