సచిన్ కూతురితో శుభ్ మన్ గిల్ లవ్వాట ?
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వారిద్దరి మధ్య సోషల్ మీడియాలో వీరిద్దరు ఒకరినొకరు అనుసరిస్తున్నారు. అంతేకాకుండా పరస్పరం అనేక విషయాల్లో కామెంట్లు పెడుతున్నారు.
ఆ మధ్యన గిల్ ఓ కారుకొంటే అందుకు సారా అభినందనలు తెలియజేసింది. అప్పుడు వెంటనే ‘నీ బదులు సారాకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను బ్రో’ అని గిల్‌ను హార్దిక్ పాండ్య కవ్వించాడు. తాజాగా శుభ్‌మన్ ఇన్‌స్టాలో ఓ అందమైన చిత్రం పోస్ట్ చేశాడు. దానికి ‘ఐ స్పై’ అని వ్యాఖ్య జత చేశాడు. యాదృచ్ఛికంగా అదే సమయానికి సారా తెందూల్కర్ సైతం తన ఫొటో పెట్టి ‘ఐ స్పై’ అని పోస్ట్ చేసింది. వీరిద్దరివీ వ్యక్తిగత చిత్రాలే అయినప్పటికీ ఒకే సమయంలో ఒకే తరహా వ్యాఖ్య పెట్టడంతోనే మళ్లీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.
గతంలోనూ శుభమ్ గిల్ పేరు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తో లింకుపెడుతూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సచిన్ కూతురు సారాతో ఈ యువ క్రికెటర్ పేరు విపిస్తోంది. మరీ.. ఈ ఇద్దరి మధ్య నిజంగానే ఏదైనా ఉందా ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.