కరోనా నుంచి యువకులు సేఫ్ కాదు : WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు కరోనా మహమ్మారి యువకులపై పెద్దగా ప్రభావం చూపించదు. ఒకవేళ కరోనా బారినపడిన యువకులు త్వరగా కోలుకొనే అవకాశాలున్నాయి అనుకున్నారు. అయితే చిన్న పిల్లలు, వృద్దులు మాత్రం కరోనా నుంచి జాగ్రత్త ఉండాలి. వారు కోలుకొనే శాతం తక్కువ అని చెప్పారు. తాజాగా యువకులు కూడా సేఫ్ కాదని WHO ప్రకటించింది.

యువకులు ఈ వైరస్‌కు అతీతం కాదని పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని ఇదేవరకే స్పష్టం చేశామని, అయినప్పటికీ మరోసారి హెచ్చరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ గెబ్రెయేసస్‌ స్పష్టం చేశారు.యువకులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంది, కరోనా బారినపడిన యువకులు కూడా మరణించే అవకాశాలు ఉన్నాయి. వీరి నుంచి వైరస్‌ మరొకరికి సోకే ప్రమాదం ఉంది’ అని అధోనామ్‌ అన్నారు. అందుకే మిగతావారిలాగే యువకులు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.