ఉద్యోగులకి కేసీఆర్ శ్రావణమాస కానుక

ప్రభుత్వ ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. సీఎం కేసీఆర్ ఏ  పని చేసినా ముహూర్తాలని ఫాలో అవుతారన్న సంగతి తెలిసిందే. ఇందుకోసమే ముందస్తు ఎన్నికలకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణని కూడా నెలల పాటు వాయిదా వేశారని చెబుతున్నారు. ఇప్పుడు శ్రావణమాసమం నడుస్తున్న నేపథ్యంలో మంచి ముహూర్తం రోజున సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకి తీపి కబరు చెప్పబోతున్నారట.

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 ఏళ్లకు మార్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరగనున్న క్యాబినేట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారమ్. ఆగస్టు 15 లేదా ఇదే నెల 17 మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజైన ఉద్యోగుల రిటెర్మెంట్ వయో పరిమితిపై ప్రకటన చేయొచ్చని తెలిసింది. వయో పరిమితిని 60 లేదా 61కి పెంచుతామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో ఈ నెలలో రిటైర్మెంట్ కాబోతున్న వారికి ప్రయోజనం కలగనుంది.