వంగపండు ఇకలేరు

1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. 1972లో జననాట్యమండలిని స్థాపించారు. విప్లవ కవి వంగపండు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడు సార్లు సీపీఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం కూలిపోయింది. ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లా పార్వతీపురం వైకేఎంనగర్‌లో మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 1943 జూన్‌లో పార్వతీపురం పెదబొండపల్లిలో జన్మించిన ఆయన ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుగాంచారు. ప్రజల కోసం బ్రతికిన నాజర్‌లాంటి కళాకారుడని వంగపండును పోలుస్తారు. ఆయన గద్దర్‌తో కలిసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి, అధ్యక్షుడిగా పని చేశారు.