ఉప ఎన్నికలో పవన్ పోటీ.. ఈసారైన గెలుస్తాడా ?
మూడు రాజధానుల ఏర్పాటు అంశంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయ్. రాజధాని వికేంద్రీకరణ్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైనట్టేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14లోగా ప్రభుత్వ కార్యాలయాలని విశాఖకి తరలించే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలో న్యాయ పరమైన చిక్కులు మొదలయ్యాయ్. రాజధాని తరలింపుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
మరోవైపు తెదేపా రాజీనామాల డిమాండ్ చేస్తోంది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలకి రెడీ కావాలని డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు. ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశం పెట్టనందున ప్రభుత్వాన్ని రద్దు చేసి.. మరోసారి ప్రజాభిప్రాయం కోరాలి. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిజంగానే ఏపీలో ఉప ఎన్నికలు వస్తే.. భాజాపాతో కలిసి జనసేన పోటీ చేసే అవకాశాలున్నాయి. అప్పుడే ఏదో ఒక నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పవన్ మొదటి నుంచి అమరావతి రైతులకి అండగా ఉంటున్నారు. అందుకే ఈ సారి పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఒకవేళ మళ్లీ ఓడితే మాత్రం పవన్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.