సింగర్ సునీత.. మళ్లీ పెళ్లెప్పుడు ?

సింగర్ సునీత చాలా యేళ్ల నుంచి భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. చాలా సందర్భాల్లో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. అంతేకాదు.. సునీతపై పలు గాసిప్ లు కూడా వచ్చాయి. ఇక యాంకర్, నటి ఝూన్సీ విషయంలో కూడా అంతే. అయితే వీరిద్దరు రెండో పెళ్లి గురించి తాజాగా స్పందించారు.

అలీతో సరదాగా కార్యక్రమానికి వీరిద్దరు కలిసి హాజరయ్యారు. ఈ షోలో మీరు మళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ? అని అడిగారు. ఈ ప్ర‌శ్న‌ను స్వాగ‌తించింది ఝాన్సీ. త‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డం గురించి స్పందిస్తూ.. చేసుకుంటే త‌ప్ప‌కుండా చెబుతానంటూ స‌మాధానం ఇచ్చింది. ఇక సునీత స్పందిస్తూ.. ప్ర‌స్తుతం త‌ను హాయిగా ఉన్న‌ట్టుగా, ‘ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేం..’ అంటూ వ్యాఖ్యానించింది.