దేశంలో ఒక్కరోజే 1007 కరోనా మరణాలు
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కొత్త కేసులు నమోదైన రేంజ్ లో మరణాల సంఖ్య నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో1007మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరింది.
గడిచిన 24గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 15లక్షల 35వేల మంది కోలుకోగా మరో 6లక్షల 34వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 54వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 69శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల మరణాల రేటు 2శాతంగా ఉంది. ప్రపంచంలో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా బ్రెజిల్, భారత్లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.