అమ్మకు కోసం చేపల ఫ్రై చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తల్లి కోసం వంట చేయడం ఇష్టపడతారు. గతంలో చిరు అమ్మ కోసం దోసెలు వేశారు. ఈ సారి సండే స్పెషల్గా చేసిన వంటకం మరీ ప్రత్యేకం. తన చిన్నతనంలో అమ్మ తనకు తినిపించిన అనేక రుచుల్లో ఒకదానిని ఎంపిక చేసుకున్నారు.
గోదావరి జిల్లాలో దొరికే కట్టె పరిగె అనే చిన్న సైజు చేప వంటకం. మరి దీనిని చింతతొక్కుతో కలిపి స్వయంగా ఫ్రై చేసిన చిరు.. తన తల్లికి దగ్గరుండి మరీ వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోను, తన అభిమానులతో పంచుకున్నారు.
ప్రసుత్తం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదాపడింది.