రాజస్థాన్ లో కాంగ్రెస్ వ్యూహాం ఫలించింది
రాజస్థాన్ లో కాంగ్రెస్ వ్యూహాం ఫలిచింది. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ రాజకీయాలు సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై అసంతృప్తితో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబావుటా ఎగరవేశారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పుడు సచిన్ పైలట్ చల్లబడి.. తిరిగి సొంతగూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ మొత్తం ఏపీసోడ్ లో రెండు పాయింట్స్ సచిన్ ని తిరిగికి కాంగ్రెస్ కు దగ్గర చేశాయని అర్థం అవుతోంది.
తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ను కాంగ్రెస్ టార్గెట్ చేయలేదు. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం మాత్రమే చేసింది. సచిన్ ను పల్లెత్తు మాట కూడా అనొద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆల్టీమేటం జారీ చేసింది. సచిన్ పైలట్ కూడా తన అసంతృప్తి కేవలం సీఎం అశోక్ గెహ్లాట్ పై మాత్రమే. పార్టీపైన కాదని ముందు నుంచి చెబుతున్నారు. ఈ రెండు అంశాలే సచిన్ పైలట్ ని తిరిగి సొంతగూటికి చేరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సోమవారం ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో రాహుల్‌తో సుమారు రెండు గంటల పాటు సచిన్ పైలట్ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నట్లు సమాచారం. తన పోరాటం కేవలం అశోక్ గహ్లోత్‌పైనే తప్ప.. కాంగ్రెస్ పార్టీపై కాదని సచిన్ పైలట్ చెప్పినట్లు సమాచారం. ఇకపై రెబల్‌గా ఉండబోనని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెరపడనుంది.