6 రాష్ట్రాల సీఎం’లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ !

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడబోతున్నారు. అయితే ఈ సారి కేవలం ఆరు రాష్ట్రాల సీఎంలతో మాత్రమే ప్రధాని మాట్లాడనున్నారు. అదీ కూడా కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేష్, కర్నాటక, తమిళ్ నాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడనున్నారు. కరోనా అంశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రధాని నిలదీసే అవకాశాలున్నాయి. కరోనా విషయంలో కేంద్ర సహాయం గురించి ఈసారి గట్టిగా అడిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. గతంలో ఐదారు సార్లు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ పలు హామీలు  ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వాటిని ఏమాత్రం నిలబెట్టుకోలేదట. ఈ నేపథ్యంలో తెలంగాణ , పశ్చిమ బెంగాల్  సీఎంలు ప్రధాని అడుగుతారని తెలుస్తోంది.