హైదరాబాద్‌లో వ్యభిచారం ముఠా అరెస్ట్
కరోనా విజృంభిస్తున్న వారి బిజినెస్ బాగానే జరుగుతోంది. లాడ్జీలో గుట్టు చప్పుడు కాకుండా రాసలీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని ఓ లాడ్జీపై పోలీసులు దాడి చేసి ఇద్దరు యువతులతోపాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్‌కు చెందిన రఫీక్ అనే వ్యక్తి కోఠిలోని పూత్లీబౌలి చౌరస్తా వద్ద ఆదిలాబాద్ లాడ్జీ పేరుతో గత కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వాసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి 9 గంటలకు సుల్తాన్‌బజార్ ఎస్సై లింగారెడ్డి తమ సిబ్బందితో కలిసి లాడ్జీపై దాడి చేసి ఇద్దరి యువతులు, ఇద్దరు విటులతోపాటు లాడ్జీ సూపర్ వైజర్ రవిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.