ఆడపిల్లలకి ఆస్తి హక్కు.. సుప్రీం కీలక తీర్పు
తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ-వారసత్వపు హక్కు దాఖలు అవుతుందని సుప్రీం 2005 సెప్టెంబర్ 9లో సవరణ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తీర్పుని సుప్రీం సవరించింది.
సవరణ తేదీ నాటికి కుమార్తె, తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందన్న తీర్పునిచ్చింది. కుమారుడితో సరిసమానంగా కుమార్తెకూ ఆస్తిలో హక్కును ప్రసాదించిన ఈ తీర్పు.. హిందూ అవిభక్త కుటుంబాల్లో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధాన్ని తొలగించినట్టయింది.