ట్రెండింగ్’లో ‘వకీల్ సాబ్’.. అప్ డేట్ ఇస్తాడట !

‘వకీల్ సాబ్’తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం #VakeelSaab యాష్ ట్యాగ్ ని పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. 500kవ్యూస్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అంతేకాదు.. ఈ సాయంత్రం వకీల్ సాబ్ నుంచి అప్ డేటు ఇవ్వబోతున్నట్టు చెబుతున్నారు. అదేంటీ ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వకీల్ సాబ్ నుంచి ‘మగువా మగువా.. ‘ పాట వచ్చేసింది. సూపర్ హిట్ అయింది. అంతకుముందే వకీల్ సాబ్ నుంచి పవన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆ తర్వాత పవన్ లాయర్ పాత్రలో ఉన్న పిక్స్ లీకయ్యాయ్. మరీ… ఈ సాయంత్రం వకీల్ సాబ్ నుంచి వచ్చే అప్ డేటు ఏమై ఉంటుంది?

అంటే.. సెప్టెంబర్ 2న పవర్ కల్యాణ్ బర్త్ డే. ఆ రోజు వకీల్ సాబ్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. బహుశా.. ఆ విషయాన్నే అఫిషియల్ గా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వకీల్ సాబ్ వాయిదా పడింది. లేదంటే.. ఈ నెలలోనే వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు.