ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

పేదల కళ్లల్లో ఆనందం చూడాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం వారికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించబోతున్నారు. తొలుత ఉగాది రోజున రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అనంతరం బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతికి ఇద్దామనుకున్నా వీలు కాలేదు. దీంతో జులై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని యోచించింది. కానీ ఇళ్ల స్థలాల సేకరణ ఆలస్యంతో ఆగస్టు 15కు వాయిదా వేసింది.

ఫైనల్ గా ఆగస్టు 15 డేటుని ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ జరుగుతుండటంతో మరోసారి ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇదీగాక, కరోనా నిబంధనల నేపథ్యంలో ప్రజాప్రనిథులు కార్యక్రామాల్లో పాల్గొనడం కష్టం అవుతోంది. ఆన్ లైన్ లో కానిచ్చేయాలి. అది ప్రభుత్వానికి వచ్చే మైలేజీని తగ్గించవచ్చు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఉచిత ఇళ్ల పట్టాల పంపిణిని ప్రభుత్వం వాయిదా వేసినట్టు తెలుస్తోంది.