కరోనాతో పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి
సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. దురదృష్టవశాత్తు వీరిలో కొందరు మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడే పాలెం శ్రీకాంత్‌రెడ్డి. గతంలో శ్రీకాంత్‌రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. మోడరన్ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తెలుగుదేశం యువత విభాగానికి కొన్నాళ్లపాటు అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలో ‘బాబు ఈజ్ బ్యాక్’, బాబు వస్తే జాబు అనే నినాదాలు ఇచ్చారు.