‘బిగ్ బాస్ 4’ ప్రోమో వచ్చేసింది !

బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా మూడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. అతి త్వరలోనే నాల్గో సీజన్ మొదలు కానుంది. నాల్గో సీజన్ కి కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహించారు. తాజాగా బిగ్ బాస్ 4కి ప్రోమోని కూడా వదిలారు. ఇందులో నాగ్ కొత్త గెటప్ లో కనిపించారు. చాలా ఓల్డ్ గెటప్ లో కనిపించారు.ఈ టీజర్‌లో నాగార్జున ఒక దుర్భిణి పెట్టుకొని బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏం జరుగుతోందో చూడాలనే ఆరాటంలో ప్రేక్షకులు ఉన్నట్టు డిజైన్ చేశారు.  నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడ్డానికి ‘స్టే ట్యూన్డ్ అంటూ స్టార్ మా’ ఈ ప్రోమోకి క్యాప్షన్ ఇచ్చింది.

ఇక కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. కంటెస్టెంట్స్ అందరికీ హెల్త్ భీమా చేయించనుందట. అంతేకాదు.. షో ప్రారంభం కావడానికి 14 రోజుల ముందు నుంచే కంటెస్టెంట్స్ ని హోం క్వారంటైన్ చేయనుంది. వారికి కరోనా టెస్టులు చేసిన తర్వాతే షోలో పాల్గొనడానికి అనుమతిని ఇవ్వనుంది. ఇక ఈ సారి బిగ్ బాస్ షో 100రోజులు కాకుండా.. 70 రోజులకే  కుదించనున్నారని తెలిసింది. నాగ్ బర్త్ డే కానుకగా ఈ నెల 29 నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందని సమాచారమ్.