ఐపీఎల్ కోసం కఠినంగా శ్రమిస్తున్న హార్థిక్ పాండ్యా
కరోనా లాక్డౌన్ తో క్రికెటర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు నాలుగు నెలలపాటు ఇంట్లోనే ఉన్నారు. ఈ ఖాళీ సమయంలో నచ్చిన పనులు చేసుకున్నారు. కుటుంబంతో హాయిగా గడిపారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులని అలరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆటగాళ సెలవులు ముగిశాయ్. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 13 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ పై పోకస్ పెట్టారు ఆటగాళ్లు.
ఇందులో భాగంగా ఫిట్నెస్ ని మెరుగుపరచుకుంటున్నారు. ఎక్కువ సేపు జిమ్, నెట్స్ లో గడుపుతున్నారు. తాజాగా ఐపీఎల్ కోసం టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్న జిమ్ వీడియో ఒకటి బయటికొచ్చింది. ఇందులో చమటలు కారేలా పాండ్యా కసరత్తులు చేస్తున్నారు. హార్థిక్ గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తిరిగి జట్టులో స్థానం సంపాదించాలంటే ఐపీఎల్ మంచి వేదిక. అందుకే ఐపీఎల్ లో సత్తా చాటెందుకు బాగా కష్టపడిపోతున్నాడు. ఐపీఎల్ లో హార్థిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Hardik Pandya sweating it out ahead of the IPL 2020
.
.
.
.
.
.#hardikpandya #mumbaiindians #indianspremierleague #franchise #mi #ipl #allrounder #IPL2020 #workout #training #cricket #sports #Indiansportsbeat #isb pic.twitter.com/1NCP7tzSbv— Indian Sports Beat (@indiansbeat) August 12, 2020