‘వి’ ఓటీటీ రిలీజ్ డేటు ఫిక్స్ !

మరో తెలుగు సినిమా ఓటీటీలో రిలీక్ కాబోతుంది. ఇప్పటి వరకు తెలుగు నుంచి ఓటీటీలో రిలీజైన సినిమాల్లో ఇది కాస్త పెద్ద సినిమా. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబుల మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘వి’. అతిథి రావు హైదరి, నివేధా థామస్ హీరోయిన్స్. దిల్ రాజు నిర్మాత.

ఏప్రిల్ లోనే ‘వి’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూతపడటంతో ‘వి’ విడుదల ఆగిపోయింది. ఓటీటీల నుంచి ‘వి’కి భారీ ఆఫర్లు వచ్చినా.. మాది ఓటీటీ సినిమా కాదు. థియేటర్స్ లో చూడాల్సిన సినిమాని చిత్రబృందం చెప్పింది. అయితే ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గేలా లేదు. థియేటర్స్ తిరిగి తెరచుకునేలా లేవు. తెరచుకున్నా.. ఆడియెన్స్ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసే సాహాసం చేసేలా లేరు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆపర్ ని దిల్ రాజు ఓకే చేశారు. సెఫ్టెంబర్ 5న ‘వి’ ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారమ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకట్రెండు రోజుల్లోనే రావొచ్చని చెబుతున్నారు.