‘దేవుడా.. నా దేవుడి జోలికి రాకు’

లెజెండ్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలుగారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్స్ ట్విట్ చేస్తున్నారు.

“దేవుడా… నా దేవుడి జోలికి రాకు” అంటూ ట్వీట్ చేశారు. “ఎస్పీబీ సర్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆ దిగ్గజం కోలుకోవాలని మనందరం ప్రార్ధిద్దాం… నాతో కలవండి” అంటూ రామజోగయ్య శాస్త్రి విజ్ఞప్తి చేశారు.

‘సంగీత అభిమానులందరికీ ఇదే నా విన్నపం. మన లెజెండ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. తన అద్భుతగానంతో మనల్ని ఎంతో రంజిప చేశారు” -ఏఆర్‌ రెహమాన్‌

”డియర్‌ ఎస్పీబీ సర్‌.. త్వరగా కోలుకోవాలి. ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నా” -అనిరుధ్‌

”మన గాన గంధర్వుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని గట్టిగా ప్రార్థిద్దాం” -దేవి శ్రీ ప్రసాద్‌

”ఎస్పీబీ సర్‌ను ఐసీయూలో ఉంచారనగానే మాట రాలేదు. ఆయన త్వరగా కోలుకోవాలి” -ఖుష్భూ

”కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ఆయన త్వరగా కోలుకుని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుని మనసారా ప్రార్థించుదాం” – తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు