నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్  


హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా బారినపడింది. ఈ విషయాన్ని తెలూతూ నిక్కీ ట్విట్ చేసింది. తనకు గత వారమే కరోనా సోకిందని, ప్రస్తుతం ఆ వైరస్ నుంచి తను త్వరగా కోలుకుంటున్నానని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో పాటు యంగేజ్ లో ఉన్న కారణంగా కరోనా నుంచి త్వరగా కోలుకుంటాననే నమ్మకం తనకు ఉందన్నారు.

ఇక కరోనా బారినపడిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కోలుకుంటున్నారు. చెన్నైలోని చూళైమేడు ప్రాంతంలో ఉన్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు బాల సుబ్రమణ్యం. అయితే ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.