నిహారిక నిశ్చితార్థం.. పవన్ ఎందుకు రాలేదబ్బా ?
హైదరాబాద్లో గురువారం బిజినెస్మెన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్చరణ్, అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారుడు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాలేదు.
దీంతో మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. పవన్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు. అందుకే రాలేదేమో అనుకుందమంటే.. ? ఇటీవల హీరో నితిన్ పెళ్లికొడుకు వేడుకకు స్నేహితుడు త్రివిక్రమ్ తో కలిసి హాజరయ్యాడు కదా అంతున్నారు. ఒకేవేళ పవన్ కి కుదరకపోతే.. ఆయన పిల్లులు, భార్యని పంపించవచ్చు కదా అంటున్నారు. మొత్తానికి నిహారిక నిశ్చితార్థ వేడుకతో మెగా బ్రదర్స్ మధ్య విబేధాలున్నాలు అనే న్యూస్ వైరల్ గా మారింది.