రష్యాకు షాక్ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో
రష్యా కరోనా వాక్సీన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘనంగా ప్రకటన చేశారు. మరోవైపు రష్యా విడుదల చేసిన కొవిడ్ టీకాపై శాస్ర్తవేత్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండానే వైరస్‌పై ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పడాన్ని తప్పు పడుతున్నారు. తాజాగా రష్యాకు డబ్ల్యూహెచ్‌వో షాకిచ్చింది.
రష్యా ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు పూర్తి కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రస్తుతం 9 టీకాలు మాత్రమే తుది పరీక్షల జాబితాలో ఉన్నాయని, అందులో రష్యా వ్యాక్సిన్ లేదని స్పష్టంచేసింది. రష్యా వ్యాక్సిన్‌పై ఓ నిర్ణయానికి వచ్చేందుకు తమ వద్ద పూర్తి సమాచారం లేదని పేర్కొంది.