లవ్ అగర్వాల్’కు కరోనా
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అగర్వాల్ ట్విట్ చేశారు. ఇటీవల తనను కలిసిన అందరు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. త్వరలోనే అందరి చూడాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్‌కు చెందిన 48 ఏళ్ల లవ్ అగర్వాల్ ఇటీవల కేంద్ర సర్వీసులకు వెళ్లగా.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితి, కేంద్రం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కొద్ది రోజులుగా మీడియాకు బ్రీఫింగ్ ఇస్తున్నారు.
ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన కరోనానుంచి కోలుకున్నారు. శుక్రవారం చేసిన కరోనా టెస్టుల్లో అమిత్ షాకు కరోనా నెగటివ్ వచ్చింది. అయితే వైద్యుల సూచనల మేరకు మరికొన్నిరోజులు హోం క్వారంటైన్ లోనే ఉంటానని అమిత్ షా తెలిపారు.