టీజర్ టాక్ : గుడ్ లఖ్ సఖి

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్ లఖ్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్‌ రాజు పమర్పణలో సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. అదృష్టం లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఏకంగా రైఫిల్‌ షూటింగ్‌లో ఉన్నత శిఖరాలను ఎలా చేరుకున్నదనే విషయాన్ని అలరించేలా తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో కీర్తి సురేశ్ నటన హైలైట్ గా నిలిచింది. ఈ టీజర్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !