బాలు ఆరోగ్యంపై ఇళయరాజ ఎమోషనల్ వీడియో

లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కరోనాతో ఆయన చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన అరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలు త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా మూజిక్ మాస్ట్రో  ఇళయరాజా తన స్నేహితుడు బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు.

‘సినిమాల కంటే ముందే సంగీత వేదికలపై ఇద్దరం కలిసి కచేరీలు చేశాం. అలా మొదలైన మన స్నేహం, సంగీతం, స్వరం లాంటిది. స్వరం లేని సంగీతం ఎలా ఉండదో, అలానే నీ స్నేహం, నా స్నేహం, మన స్నేహం ఎప్పటికీ దూరం కాదు. ఇద్దరి మధ్య గొడవలకు స్నేహానికి సంబంధం లేదని, స్నేహం ఎప్పటికీ స్నేహమేనన్న విషయం నీకూ తెలుసు, నాకూ తెలుసని, కాబట్టి కోలుకుని త్వరగా లేచి రా’ అని వీడియోలో కోరారు ఇళయరాజా.