2020లో మరో దారుణం : అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు

2020లో అనీ దారుణాలే. కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. మరోవైపు గ్యాస్ లీకులు, అగ్ని ప్రమాదాలు, ఫైట్ క్రాశ్.. ఇలా అన్నీ విధ్వాంసాలే. తాజాగే వీటిని మించిన షాకింగ్ న్యూస్ ఒకటి వచ్చిపడింది. అదే టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్. అవునూ.. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు! తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ సందేశం ఉంచాడు. ‘కెరీర్‌ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియో పెట్టాడు.

వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోని జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ధోని రిటైర్మెంట్ పై హాట్ హాటుగా చర్చ సాగుతోంది. మాజీ ఆటగాళ్లు, కోచ్ లు ధోని నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందన్నారు. ధోని అభిమానులు మాత్రం.. ఐపీఎల్ లో సత్తా చాటి ధోని మళ్లీ జట్టులోకి వస్తాడని భావించారు. ధోని కూడా అందరి కంటే ముందుగానే ఐపీఎల్ కోసం ప్రాక్టీసు మొదలుపెట్టారు. కానీ కరోనాతో ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేశాడు ధోని.

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందులో ధోని రాణించి.. మళ్లీ జట్టులోకి వస్తాడని ఆయన అభిమానులు భావించారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. రిటైర్మెంట్ ప్రకటించాడు ధోని. ఆటగాడిగా, కోచ్ గా మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో.. అంతే ప్రశాంతంగా రిటైర్మెంట్ ప్రకటించారు దోని. కెప్టెన్, లీడర్, లెజెండ్ ధోని మిగితా జీవితం మరింత బాగుండాలని కోరుకుంటోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.