‘సన్నాఫ్ ఇండియా’గా మోహన్ బాబు

డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కొత్త సినిమాని ప్రకటించారు. డైమాండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో నటించబోతున్నట్టు ట్విట్ చేశారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మోహన్ బాబు 560 చిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడు, కథానాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు, హాస్యనటుడు… ఇలా ప్రతి పాత్రలో మెప్పించారు. నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. ఇటీవల కాలం సినిమాలు బాగా తగ్గించిన మోహన్ బాబు.. పంద్రాగస్ట్ రోజున సన్నాఫ్ ఇండియా సినిమా ప్రకటన చేశారు. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.