ట్రంప్ ఇంట్లో విషాదం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో విషాదం నెలకొంది. ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ (71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మాన్హాటన్ లోని న్యూయార్క్ – ప్రెస్బిటేరియన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు.

తమ్ముడు మరణంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘రాబర్ట్ ట్రంప్ తన సోదరుడు మాత్రమే కాదని, చాలా మంచి స్నేహితుడని చెప్పాడు. తన సోదరుడిని చాలా మిస్ అవుతున్నా’నన్నారు. తమ్ముడి అంత్యక్రియలకి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారని సమాచారమ్.