మహేష్, ప్రభాస్ సినిమాలోనూ నివేధా !

యంగ్ హీరోయిన్ నివేధా థామస్ పంటపడింది. ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ నివేధా థామస్ దక్కించుకుంది.

మహేష్ సినిమా మాత్రమే కాదు.. ప్రభాస్ సినిమాలోనూ నివేధా రెండో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారమ్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్  హీరోయిన్ దీపికా పదుకొనెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్ కి అవకాశం ఉంది. ఆ పాత్ర కోసం నివేధా ని సంప్రదిస్తున్నట్టు సమాచారమ్. మొత్తానికి ఒకే టైమ్ లో ఇద్దరు స్టార్ హీరోలు మహేశ్, ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది నివేధా.