కంగనాకు పొలిటికల్ ఆఫర్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు పొలిటికల్ ఎంట్రీపై స్పందించింది. తనకు చాలా యేళ్ల కిత్రమే కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ పార్టీ నుంచి టికెట్ ఆఫర్ వస్తూనే ఉంది. ఇక ఇటీవల కాలంలో బీజేపీ నుంచి కూడా టికెట్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ తన సినిమా దృష్టంతా ప్రస్తుతం సినిమాలపైనేనని తెలిపింది.
“గ్యాంగ్ స్టర్ సినిమా తర్వాత దాదాపు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఆఫర్ వచ్చేది. కాంగ్రెస్ నుంచే కాకుండా.. మణికర్ణిక చిత్రం తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు టికెట్ ఆఫర్ వచ్చింది. ఒక ఆర్టిస్ట్ గా నా వర్క్ అంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం. పాలిటిక్స్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం” అంటూ కంగనా చెప్పుకొచ్చింది.