ధోని రిటైర్మెంట్’పై రాజమౌళి కామెంట్

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు ధోని రిటైర్మెంట్ పై స్పందిస్తున్నారు. ధోని లేని లోటు తీర్చలేనిది. పూడ్చలేనిదని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ధోని రిటైర్మెంట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“మీరు మమ్మల్ని ఎంతగానో ఎంటర్‌టైన్ చేశారు. గర్వపడేలా చేశారు. అంతకు మించి ఇన్‌స్పైర్ చేశారు. మీ రిటైర్‌మెంట్ మాకు కాస్త కష్టంగానే ఉంది. భవిష్యత్ తరాలకు మీరు తప్పక మార్గదర్శకంగా నిలుస్తారు” జక్కన్న రాసుకొచ్చారు. ఇక ఎంఎస్ ధోని బయోపిక్ తెలుగు వర్షన్ ఆడియో వేడుకలో రాజమౌళి ధోనితో కలిసి వేదికని పంచుకున్న సంగతి తెలిసిందే.