ఈషా రెబ్బా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్


తెలుగమ్మాయి ఈషా రెబ్బకు షాక్ తగిలింది. ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి గురైంది. ఈషా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫోటో షూట్ ఫోటోలని షేర్ చేసుకుంటుంది. టాలీవుడ్ లో ఫోటో షూట్స్ చేసే హీరోయిన్స్ లో ఈషా నెంబర్ వన్. ఆమె కొత్త ఫోటోల కోసం ఎదురు చూసే ప్రత్యేక అభిమానవర్గం ఉంది.

అయితే తాజాగా ఈషా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కి గురైంది. ఈషా ట్విట్ట‌ర్ అకౌంట్ ఓపెన్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా, అకౌంట్ లేదు అని చూపిస్తుంది‌. ప్రస్తుతం ఆమె టెక్నికల్ టీం అకౌంట్ ను మళ్లీ తమ పరిధిలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విట్టర్ ఇండియా ప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ విషయంలో సాయం తీసుకుంటున్నారట.

అందం+అభినయం ఉన్నా ఈషాకి లక్కు కలిసి రాలేదు. అదే ఉంటే ఇప్పటికే స్టార్ హీరోయిన్ లిస్టులో ఉండేది. అయినా.. నిరాశపడకుండా అంది వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ కి ఈషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. బోల్డ్ సన్నివేశాల్లో నటించేందుకు తాను సిద్ధమని ఈషా ప్రకటించింది. ఓటీటీలకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈషా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.