వరంగల్’లో ముంపు ప్రాంతాలని పరిశీలించిన కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో గత ఐదారు రోజులుగా వానలు దంచికొట్టాయ్. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు సంబవించాయి. వరంగల్ జిల్లాల్లో వదల ప్రభావం అధికంగా కనిపించింది. భారీ వర్షాల కారణంగా వరంగల్‌ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వరంగల్‌ నగరంలో పర్యటించారు.

నయీంనగర్‌ నాలా, తదితర ముంపు ప్రాంతాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. నయీంనగర్‌ నాలా ఆక్రమణలకు గురవడం వల్లే వరంగల్‌ నగరంలో వరద ముప్పు ఎక్కువగా ఏర్పడిందని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. అనంతరం సమ్మయ్యనగర్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వరద ముంపు వల్ల తాము ఎదర్కొంటున్న ఇబ్బందులను మంత్రి కేటీఆర్‌కు వివరించారు.