ఈ నెలలోనే నిహారిక పెళ్లి.. పెళ్లి పనులు షురు !


మెగా డాటర్ నిహారిక వివాహం బిజినెస్‌మెన్ జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్యతో ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నిహారిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పెళ్లి మాత్రం ఈ యేడాది డిసెంబర్ లో  ఉంటుందనే చెప్పుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదట. ఈ నెలలోనే నిహారిక పెళ్లి జరగనుందని లెటెస్ట్ న్యూస్. ఇప్పటికే నిహారిక పెళ్లి పనులు కూడా షురు అయ్యాయ్.

పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన వీడియోని నిహారిక తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. ఈ కార్యక్రమంలో  నిహారిక అక్క చెల్లెళ్లు, తోడి కోడ‌ళ్ళు, అత్త‌లు అంద‌రు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌తో పెళ్లి ప‌నులు మ‌రింత ఊపందుకోనున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే నిహారిక పెళ్లి డేటుని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పెళ్లి వేడుకని కుటుంబ వేడుకగా నిర్వహించబోతున్నారు.