ప్లాస్మా దానంపై భయపడొద్దు : రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. ప్లాస్మా దానం చేస్తానని జక్కన్న ప్రకటించారు. అయితే కొద్దిరోజుల తర్వాత ప్లాస్మా దానం చేయాలని డాక్టర్లు సూచించారు రాజమౌళి తెలిపారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన రాజమౌళి కరోనా చికిత్స, ప్లాస్మాదానంపై మాట్లాడారు.

కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదు. సకాలంలో కరోనాని గుర్తిస్తే సమస్య ఉండదు. ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. కరోనా వచ్చిన మొదట్లో ఏం చేయాలో తెలీదు. సామాజిక దూరం పాటించడం, చేతులని శుభ్రంగా కడుకోండి. బలమైన ఆహారం తీసుకొని.. విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆ మేరకు నడుచుకున్నాం అని జక్కన్న తెలిపారు.

ఇక ప్లాస్మా దానంపై భయపడాల్సిన అవసరం లేదన్నారు జక్కన్న. 130కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా పై అవగాహన కల్పించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించిందని కితాబిచ్చారు. ప్లాస్మాదానంపై ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు. రాజమౌళి  అన్నయ్య, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఇదే చెప్పారు. ప్లాస్మా ప్రాణాలని కాపాడే సంజీవిని. ప్లాస్మా దానం చేయడంలో భయపడొద్దు. కరోనా నుంచి కోలుకున్న మా కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది ప్లాస్మా దానం చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు.