మొదటి నెల బాగా ఇబ్బంది పడ్డాం
రామ్ చరణ్-ఉపాసన దంపతులు మొదటి నెల బాగా ఇబ్బంది పడ్డారట. అలాగని పెళ్లైన మొదటి నెల కాదు. కరోనా లాక్‌డౌన్ విధించిన మొదటి నెల. కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్ అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ తారలంతా ఇంటికే పరిమితం అయ్యారు. రామ్ చరణ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆ సమయంలో ఉపాసన బిజీ అయిందట.
మొదటి నెల రోజుల్లో ఉపాసన ఎక్కువగా తన ఆసుపత్రికి సంబంధించిన పనులతో బిజీగా ఉండేది. కేవలం తినే సమయంలో మాత్రమే మేం కలిసేవాళ్లం. మాకు సరదాగా మాట్లాడుకునే సమయమే దొరికేది కాదు. ఆ నెల రోజులు నేను ఒంటరిగా ఇంట్లో క్వారెంటైన్ ఉండాల్సి వచ్చిందని చరణ్ నవ్వుతూ చెప్పాడు. ప్రస్తుతం ఉపాసన తనతో ఎక్కువ సమయం కేటాయిస్తుందని చరణ్ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఉపాసన లాంటి సామాజిక స్పృహ ఉన్న భార్య దొరకడం తన అదృష్టమని పేర్కొన్న చెర్రీ.. ఆమెతో లైఫ్ హాయిగా గడిచిపోతోందని చెప్పారు. ఇకపోతే తన RRR మూవీ షూటింగ్ రీ ఓపెన్ ఎప్పుడవుతుందో చెప్పలేమని తెలిపుతూ ఖచ్చితంగా ఈ సినిమాలో తన అల్లూరి సీతారామరాజు పాత్ర సరికొత్తగా ఉండి అందరినీ మెప్పిస్తుందని అన్నారు.