ఫేస్ బుక్’లో కొత్తగా షార్ట్‌ వీడియో ఫీచర్‌

టిక్ టాక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. చాలా మంది షార్ట్ వీడియోస్ యాప్ లని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న యాప్ లోనే కొత్తగా షార్ట్ వీడియో ఫీచర్ ని తీసుకొస్తున్నారు. తాజాగా ఫేస్ బుక్ కూడా షార్ట్ వీడియో ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ కనిపిస్తాయి. దీని ద్వారా యూజర్స్‌ తక్కువ నిడివి ఉన్న వీడియోలను రూపొందించవచ్చు. వీక్షించొచ్చు కూడా. వాట్సాప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌ స్టోరీ తరహాలో మన వీడియోకి వచ్చిన వ్యూస్‌ ఎన్ని అనేది కూడా తెలుసుకోవచ్చు. 

ఇప్పటికే భారత్ మార్కెట్లో రోపోసో, మోజ్, జోష్, ఎంఎక్స్‌ టకాటక్, చింగారీ, ట్రెల్లో, మిత్రోన్‌, రీల్స్‌, హాట్‌షాట్స్ వంటి షార్ట్‌ వీడియోల యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగాయి. దీనికి తోడు యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. భారత్ లో టిక్ టాక్ బ్యాన్ తర్వాత వీటికి డిమాండ్ పెరిగింది. రోపోసో 70 మిలియన్‌, మోజ్ 50 మిలియన్, టకాటక్ 33 మిలియన్, మిత్రోన్ 23 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఇక అతి తక్కువ సమయంలోనే జోష్‌ యాప్‌ను 28 మిలియన్ డౌన్‌లోడ్‌ల, ట్రెల్, చింగారి యాప్‌లను 20 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట.