బన్నీ ఐటమ్’గా ప్రభాస్ హీరోయిన్ ?

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా ‘పుష్ప’ రాబోతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్. సుకుమార్ సినిమా అంటే అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉంటుంది. అది అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. మాస్ ని మురిపిస్తోంది. పుష్ప కోసం కూడా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటమ్ ట్యూన్ ఒకటి రెడీ చేశారట.

ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ చిందేయనుందనే ప్రచారం జరుగుతోంది. దిశా పటానీని తీసుకున్నారు. ఆమె అందాల విందు చేయనుందని చెప్పుకొంటున్నారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? పుష్పలో ఐటమ్ సాంగ్ కోసం శ్రద్దా కపూర్ ని సంప్రదించారట. ఆమె ఓకే చెప్పిందా ? లేదా ?? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్దా. ప్రభాస్ కి సరిజోడి అనిపించుకుంది. శ్రద్దా అయితే ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ప్రేక్షకులని ఊపేస్తోందని సుకుమార్ భావిస్తున్నట్టు సమాచారమ్. అందుకే దిశా పటానీ కంటే.. శ్రద్దా కపూర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరీ.. ప్రభాస్ హీరోయిన్ బన్నీ ఐటమ్ గా ఫిక్స్ అవుతుందా ? అన్నది చూడాలి.