మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ సస్పెన్షన్

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కంటే పోలీసుల్లో మార్పు కనిపించింది. సామాజిక స్పృహాతో పనిచేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న టైమ్ లో.. ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేసి ప్రసంశలు అందుకున్నారు. అయితే కొందరు పోలీసులు చేసిన చెడు పనులతో పోలీస్ వ్యవస్థకు చెడు పేరు వస్తోంది. తాజాగా స్పెషల్‌ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.చందర్‌ కుమార్‌ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

దీనిపై సదరు మహిళ సీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం ఇన్‌స్పెక్టర్‌ చందర్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు సీపీ తెలిపారు. పోలీసు శాఖలో ఇలాంటి ఘటనలు సహించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే 9490616555కి వాట్సాప్‌ సందేశం పంపించాలని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.