పవన్-రానా మల్టీస్టారర్’గా అయ్యప్పన్

మలయాళ హిట్ ‘అయ్యప్పన్ కోషియమ్’ రిమేక్ రైట్స్ కొనేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఈ రిమేక్ లో నటించేందుకు రానా దగ్గుబాటి రెడీగా ఉన్నారు. మరో హీరో కావాలి. దాని కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన ఓకే అంటే పవన్-రానా మల్టీస్టారర్ గా అయ్యప్పన్ కోషియమ్ రిమేక్ రావొచ్చు.

మరోవైపు ఈ రిమేక్ కోసం చాలా కాంబినేషన్స్ వినబడుతున్నాయి. ఇందులో రవితేజ-నాగార్జున కాంబో ఒకటి. మరోవైపు యువ దర్శకుడు సాగర చంద్ర వెర్షన్ ల మీద వెర్షన్లు తయారుచేస్తున్నారు. వినిపిస్తున్నారు. మళ్లీ తయారు చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ యాగం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. రానాను ఒప్పించిన తరువాత వెనక్కు తగ్గడానికి లేదు. అందువల్ల రానాతో పాటు సరైన హీరో ఎవరు అన్నది ఫిక్స్ అయ్యే వరకు ఈ సినిమా అప్ డేట్ అన్నది వుండదు. అయితే పవన్-రానా కాంబో అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.