‘టక్ జగదీష్’ కోసం భారీ బడ్జెట్

మీడియం రేంజ్ హీరోలో స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని. అంతేకాదు.. మంచి కథపడితే స్టార్ హీరో అంతకుమించి. యేడాది మూడ్నాలుగు సినిమాలు చేస్తూ.. చేసినవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఘనత నానిది. ఆయన ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కూడా ఉన్నాయి. అందుకే నాని సినిమాపై ఖర్చుకు నిర్మాతలు వెనకాడరు.

ఆయన తాజా చిత్రం టక్ జగదీష్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టు సమాచారమ్. ఈ సినిమా బడ్జెట్ ను 40 కోట్లకు చేర్చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో చేసి ‘వి’ లాంటి టెక్నికల్ సినిమాకు 40 కోట్లు ఖర్చు. సాహు గారపాటి నిర్మాణంలో చేసే టక్ జగదీష్ లాంటి ఫ్యామిలీ మూవీకి నలభై కోట్లు ఖర్చే. దీనికి కారణం ఈ సినిమాలో స్టార్ కాస్ట్ బాగా ఎక్కువగా వుండడం కూడా అని తెలుస్తోంది. నాన్ థియేటర్ ద్వారా 18 కోట్ల వరకు రికవరీ వచ్చే అవకాశం ఉంది.  థియేటర్ రైట్స్ ద్వారా మరో 27 వరకు రావచ్చు అని అంచనా వేస్తున్నారు. 2021 సమ్మర్ కు టక్ జగదీష్ రాబోతుంది.

ఇక ఈ సినిమాలో నాని బైపోలార్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని చిత్రబృందం కొట్టేసింది. టక్ జగదీష్ లో నాని సరదగా కనిపిస్తారు. ఫుల్లుగా నవ్విస్తారు. అదే సమయంలో శివ నిర్వాణ మార్క్ ఎమోషనల్ స్క్రీన్ ప్లే ఉంటుందని తెలిపారు.