TSలో 1,724 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,724 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 97,424 కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 729 కి చేరింది.

నిన్న ఒక్క రోజే కరోనా బారి నుంచి 1,195 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 75,186కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 21,509గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.