‘డబుల్ ఇస్మార్ట్’ ఎప్పుడంటే ?

దర్శకుడు పూరి, హీరో రామ్ ల  హిట్ ఆకలి తీర్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. చాన్నాళ్ల తర్వాత మాస్ ఆకలి తీర్చిన చిత్రం కూడా ఇదే.రామ్ లో మరో యాంగిల్ ని చూపించాడు పూరి. నభా నటాషా, నిధి అగర్వాల్ గ్లామర్ షో, డైలాగులు హైలైట్ గా నిలిచాయ్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పూరి, రామ్ లకి హిట్ ఇచ్చింది.

ఈ సినిమా రిలీజైన టైమ్ లోనే దీనికి సీక్వెల్ రాబోతుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ అనే ప్రచారం జరిగింది. అయితే రెడ్ సినిమాతో పూరి ఫైటర్ సినిమాతో బిజీ అయిపోయారు. మరీ.. డబుల్ ఇస్మార్ట్ ఉంటుందా ? ఉంటే ఎప్పుడు ఉంటుంది ?? అన్నది ఆసక్తిగా మారింది. ఫైటర్ పూర్తి చేసిన తర్వాత కరణ్ జోహోర్ నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నాడు పూరి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రామ్-పూరిల కాంబోలో డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని చెబుతున్నారు.