ప్రశాంత్ వర్మ కథతో  ప్రవీణ్ సత్తారు సిరీస్

ప్రతిభ గల దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు యువ దర్శకులు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ. గరుడవేగ తో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు మరో సినిమాని మొదలెట్టలేదు. ‘అ!’ ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు కల్కీ సినిమాతో నిరాశపరిచారు. ఈ యువ దర్శకుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్ ఇప్పుడీ ఇద్దరు దర్శకుల కాంబోలో ఓ వెబ్ సిరీస్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ అందిస్తున్న కథతో ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి 14 రీల్స్ ప్లస్ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు తదుపరి సినిమా నాగ్ తో చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త టైమ్ పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ ని పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రవీణ్ సత్తారు ఉన్నట్టు తెలుస్తోంది.