సాయం కోరిన వారికి.. సారీ చెప్పిన సోనూసూద్ !
మనిషి అంటే ప్రేమ, గౌరవం ఉన్న వాళ్లు మాత్రమే సాటి మనిషి కష్టనష్టాలు, విజ్ఞప్తులపై స్పందిస్తారు. మనుషులంటే మహా ప్రేమ ఉందని నిరూపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా విజృంభన మొదలైనప్పటి నుంచి ఆయన చేస్తున్న సాయాలు చూస్తూనే ఉన్నాం. ఇంకా సోనూ సూద్ సాయం చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తున్నారు. సాయం చేస్తున్నారు. అయితే ఇటీవల సోనూసూద్ కి వస్తున్న విజ్ఝప్తుల చిట్టా పెరుగుతోంది.
వారందిరికీ రిప్లై ఇవ్వడం కష్టంగా ఉందని.. క్షమించండని కోరారు సోనూసూద్. ఇటీవల సోనూసూద్ కి 1137 మెయిల్స్, 19 వేలు ఫేస్బుక్ మెసేజ్లు, 4812 ఇన్స్టా, మరో 6741 మెసేజ్లు ట్విటర్ ద్వారా వచ్చాయి. “నాకు సహాయం చేయాలంటూ రోజూ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మెసెజ్లు. అందరి కష్టాలు తెలుసుకొని వారికి సహాయం చేయడం కొంచెం కష్టమే.. కానీ నా శక్తి మేరకు ప్రయత్నిస్తా. ఎవరివైనా మెసెజ్లు చూడకపోతే దయచేసి క్షమించండి” అంటూ ట్వీట్ చేశారు.