‘వి’ ట్రైలర్ ఇలా ఉండబోతుందట !

దర్శకుడు ఇంద్రగంటి సినిమాలు క్లాస్ టచ్ తో ఉంటాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతాయి. అష్టాచెమ్మా, అమీతుమీ. సమ్మోహనం లాంటి సినిమాల్లో ఇంద్రగంటి క్లాస్ టచ్ ఎంజాయ్ చేశాం. నాని ‘జెంటిల్ మేన్’ని కాస్త కొత్తగా ట్రీట్ చేశారు ఇంద్రగంటి. ఇక ‘వి’ సినిమాతో ఇంద్రగంటిలోని మరో యాంగిల్ కనిపించనుందట. థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో ‘వి’ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ చూసిన వారు.. గొప్పగా చెప్పుకొంటున్నారు. ట్రైలర్ చూస్టే.. ఇంద్రగంటిలో కూడా ఓ భారీ కమర్షియల్ డైరక్టర్ వున్నారు చెప్పుకొంటారట. ట్రయిలర్ ను ఇద్దరు హీరోలకు ఒక్కోషాట్ వేస్తూ, రెండు షాట్ లకు మ్యాచింగ్ డైలాగ్ తో ప్యాచ్ చేస్తూ డిఫరెంట్ గా కట్ చేసినట్లు తెలుస్తోంది. హత్యలు చేసే ఓ సైకో, అతన్ని పట్టుకోవాలనే ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్, వీరిద్దరి మధ్య సాగే గేమ్ అని అర్థం అయిపోతుంది. కానీ చివరకు ఎలా ముగుస్తుంది అనేది ఆసక్తికరం అంటున్నారు.