సలహాల కంపెనీ నడుపుతున్న దర్శకుడు

టాలీవుడ్ లో అపజయం ఎరగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన చేసిన ఐదు సినిమాలు హిట్టే. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆయన తదుపరి సినిమాగా ఎఫ్ 2 సీక్వెల్ రావాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయింది. అయితే వెంకీ, వరుణ్ లు రెడీగా లేకపోవడంతో.. ఈ కథని వేరే దర్శకుడి చేతిలో పెట్టినట్టు సమాచారమ్. అంతేకాదు.. కరోనాతో ఖాళీగా ఉన్న ఈ టైమ్ లో అనిల్ సలహాల కంపెనీ ఒకటి పెట్టారని చెప్ప్పుకొంటున్నారు.

త‌న స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు ఐడియాల‌ను షేర్ చేసుకుంటున్నాడ‌ట‌. వెబ్ సిరీస్ ల కోసం క‌థ‌ల‌ను సిద్దం చేయ‌డంతోపాటు స్ర్కీన్ ప్లే ప‌నుల‌ను కూడా చూసుకునే ప‌నిలో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఈ డైరెక్ట‌ర్ చేతిలో మూడు స్క్రిప్ట్ లు..బాల‌కృష్ణ కోసం కామెడీ ఎంట‌ర్ టైన‌ర్, మ‌రో లేడీ ఓరియెంట్ మూవీ, ఎఫ్ 3 సిద్దంగా ఉంచుకున్న‌ట్టు సమాచారమ్. ఇంతకీ అనిల్ రావిపూడి నుంచి సలహాలు తీసుకున్న దర్శకుల ఎవరు ? అనేది చర్చనీయాంశంగా మారింది.